Trivikram Srinivas: కృష్ణ జయంతి స్పెషల్ .. మాస్ లుక్ తో అదరగొట్టేసిన మహేశ్!

Mahesh Babu Mass Look Poster Released

  • ఈ రోజున కృష్ణ జయంతి 
  • మహేశ్ 28వ సినిమా నుంచి మాస్ లుక్ 
  • ఫ్యాన్స్ లో హుషారు పెంచే పోస్టర్ ఇది 
  • సంగీతాన్ని సమకూర్చిన తమన్

ఈ రోజున కృష్ణ జయంతి .. ఈ సందర్భంగా ఆయన కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమాను రీ రిలీజ్ చేశారు. దాంతో ఘట్టమనేని అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. రీ రిలీజ్ లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

సాధారణంగా కృష్ణ పుట్టినరోజున తన సినిమాలకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ను వదలడమనేది మహేశ్ బాబు ఒక ఆనవాయితీగా పాటిస్తూ వస్తున్నాడు. ఈ సారి కూడా ఆయన అదే పద్ధతిని ఫాలో అయ్యాడు. కృష్ణ జయంతి సందర్భంగా, తన తాజా చిత్రం నుంచి ఒక మాస్ లుక్ పోస్టర్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. 

 తనని రౌండప్ చేసిన రౌడీలను ఒక పట్టు పట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా మహేశ్ బాబు ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ ఈ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 28వ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. హారిక హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఇది త్రివిక్రమ్ - మహేశ్ కాంబినేషన్లోని మూడో సినిమా కావడంతో అందరిలో ఆసక్తి ఉంది.

Trivikram Srinivas
Mahesh Babu
Pooja Hegde
  • Loading...

More Telugu News