: చిలుక ప్రాణం ఖరీదు రూ 1.90 లక్షలు!


ఒక ఇంటి యజమాని ఒక చిలుకను ముచ్చటపడి పెంచుకుంటున్నాడు. అయితే విమానం శబ్ధానికి సదరు చిలుక ఢామ్మని ప్రాణాలు వదిలేసింది. దీంతో ఆ యజమాని ఊరుకున్నాడా...! నేను ఎంతో ముచ్చటపడి పెంచుకుంటున్న చిలుక మీ విమానం వల్ల ప్రాణాలు కోల్పోయిందని ఫిర్యాదు చేశారు. దీంతో సదరు విమానానికి చెందిన వారు ఆయనగారికి అక్షరాలా రూ.1.90 లక్షలు జరిమానాగా చెల్లించుకున్నారు. ఇది లండన్‌లో జరిగింది.

బ్రిటన్‌లోని ఎయ్‌షైర్‌లో ఇటీవల హెర్క్యులస్‌ విమానం బాగా కింది నుండి వెళ్లడంతో దానినుండి వచ్చిన భారీ శబ్ధానికి ఒక చిలుక చనిపోయింది. దీంతో విమానం వల్ల వచ్చిన భారీ శబ్ధానికి చిలుక చనిపోయిందని ఆ యజమాని రక్షణ శాఖ వర్గాల వారికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అనుసరించిన రక్షణ శాఖ వారు ఆయనకు పైవిధంగా పరిహారం చెల్లించారు.

అంతేకాదు... మరో చిలుక తాను కూర్చున్న కొమ్మ మీదినుండి ఈ భారీ శబ్ధానికి అదిరి కిందపడిపోయింది. అప్పుడు దాని కాళ్లు విరిగాయట. సదరు చిలుక యజమానికి చిలుక కాళ్ల చికిత్సకు అయ్యే ఖర్చును రక్షణ శాఖ వారు చెల్లించారు. ఇంతేకాదు... తక్కువ ఎత్తులో విమానాలు ఎగరడం వల్ల తమ కోళ్లు గుడ్డు పెట్టే సామర్ధ్యం తగ్గిందని, ఇంకా పిల్లల ఆటసామాన్లు దెబ్బతిన్నాయని, మూగజీవాలు బెదిరిపోయాయని ఇలా పలు సంఘటనలు జరిమానా చెల్లింపుల ఖాతాలో ఉన్నాయి. గత మూడేళ్లలో ఇలాంటి వాటికి బ్రిటన్‌ రక్షణ శాఖ వారు చెల్లించిన జరిమానాల ఖర్చు అక్షరాలా రూ.12 కోట్లని డెయిలీ మిర్రర్‌ పేర్కొంది.

  • Loading...

More Telugu News