Rakshith: 'నరకాసుర' ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

Narakasura First Glimpes Released

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'నరకాసుర'
  • రక్షిత్ జోడీగా అపర్ణ జనార్దన్ 
  • ఆసక్తిని రేపుతున్న ఫస్టు గ్లింప్స్ 
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న సినిమా

రక్షిత్ హీరోగా 'నరకాసుర' సినిమా రూపొందింది. ఆయన సరసన నాయికగా అపర్ణ జనార్దన్ నటించింది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమైన ఈ సినిమాకి. సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ భాషలన్నిటిలోను ఫస్టు గ్లింప్స్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. 
 
శివుడి నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకి సంబంధించిన షాట్స్ ను ఆవిష్కరిస్తూ, ఆర్ఆర్ పై కట్ చేసిన విజువల్స్ ఆసక్తిని రేకెత్తించేవిగా ఉన్నాయి. కంటెంట్ విషయంలో ఏ అంశాన్ని రివీల్ చేయకుండా ఉత్కంఠను రేకెత్తించే ప్రయత్నం చేశారు. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాలో నాజర్ ... చరణ్ రాజ్ .. సంకీర్తన ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.

వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి అపర్ణ జనార్దన్ పరిచయం కానుంది. గ్లామరస్ గా కనిపిస్తున్న అపర్ణకి ఈ సినిమా తరువత ఇక్కడ వరుస అవకాశాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News