Balakrishna: పుల్లేటికుర్రులో బాలకృష్ణ కోలాహలం... వీడియో ఇదిగో!

Balakrishna visits Pulletikurru village

  • మహానాడు కోసం రాజమండ్రి వచ్చిన బాలయ్య
  • నిన్నటితో ముగిసిన మహానాడు
  • కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు వెళ్లిన బాలకృష్ణ
  • నాగమల్లేశ్వర సిద్ధాంతి నివాసంలో బాలయ్య సందడి 

టాలీవుడ్ అగ్రనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పాల్గొనడం తెలిసిందే. నిన్న సాయంత్రం జరిగిన భారీ బహిరంగ సభతో టీడీపీ మహానాడు కార్యక్రమం ముగిసింది.

కాగా, బాలకృష్ణ నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు గ్రామంలో సందడి చేశారు. ఇక్కడి చౌడేశ్వరి అమ్మవారి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, కారుపర్తి నాగమల్లేశ్వర సిద్ధాంతి నివాసానికి వెళ్లారు. అక్కడ, నాగమల్లేశ్వర సిద్ధాంతి, ఆయన కుటుంబ సభ్యులతో బాలయ్య ఆత్మీయంగా ముచ్చటించారు. 

బాలకృష్ణ తమ గ్రామానికి రావడంతో పుల్లేటికుర్రు గ్రామస్తుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు నాగమల్లేశ్వర సిద్ధాంతి నివాసం వద్దకు భారీగా చేరుకుని జై బాలయ్య నినాదాలు చేసి బాలకృష్ణ దృష్టిని ఆకర్షించారు. బాలకృష్ణ వారికి అభివాదం చేశారు. 

అక్కడ కొద్దిసేపు ఉన్న అనంతరం బాలయ్య కారులో వెళ్లిపోయారు. పుల్లేటికుర్రులో తన పర్యటన సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు.

Balakrishna
Pulletikurru
Dr BR Ambedkar Konaseema District
TDP
TDP Mahanadu
Rajahmundry

More Telugu News