Naresh: 'మళ్లీ పెళ్లి' మూవీ మండే టాక్!

Malli Pelli movie update

  • ఈ నెల 26న విడుదలైన 'మళ్లీ పెళ్లి'
  • ఎమ్మెస్ రాజు నుంచి వచ్చిన సినిమా ఇది 
  • నరేశ్ ధోరణి పట్ల ఆడియన్స్ అసహనం 
  • మరొకరిని నిందించడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యలు 
  • కంటెంట్ పట్ల పెరుగుతున్న అసంతృప్తి

నరేశ్ - పవిత్ర లోకేశ్ జంటగా రూపొందిన 'మళ్లీ పెళ్లి' సినిమా ఈ నెల 26వ తేదీన విడుదలైంది. విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో వనిత విజయ్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. ప్రత్యేకమైన పాత్రలలో శరత్ బాబు - జయసుధ కనిపించారు. 

నరేశ్ - పవిత్ర లోకేశ్ కి సంబంధించి ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ సినిమా రావడం, అందుకు సంబంధించిన సంఘటనలు కొన్ని ట్రైలర్ లో కనిపించడంతో సహజంగానే కొంతమందిలో ఆసక్తి పెరిగింది. ఈ కథలో వాస్తవ సంఘటనలను పోలిన సన్నివేశాలు ఉన్నాయా? లేదంటే జరిగిన సంఘటనలనే సినిమాగా ఆయన అందించాడా? అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. రెండవదే కరెక్ట్ అనే విషయం, సినిమా మొదలు కాగానే తేలిపోయింది. 

ఇక ఈ సినిమా వసూళ్ల సంగతి అలా ఉంచితే, నరేశ్ తన మూడో పెళ్లి గురించిన విషయాలతో బోర్ కొట్టించాడనే టాక్ పుంజుకుంది. ఈ మాత్రం దానికి సినిమా తీయడం ఎందుకు? వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ ను వరుసగా చూసుకునే వాళ్లం కదా అనే అసహనాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత ఖర్చుపెట్టి మరొకరిపై నిందలు వేయడం సరైనది కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కొన్ని రొమాంటిక్ మూడ్స్ పట్ల కూడా జనాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నరేశ్ తన వైపు నుంచి క్లారిటీ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం, మరిన్ని విమర్శలను తెచ్చిపెట్టిందనే అనిపిస్తోంది.

More Telugu News