Keerthi Suresh: వాలు చూపుల వల విసురుతున్న కీర్తి సురేశ్ .. లేటెస్ట్ పిక్స్!

Keerthi Suresh Special

  • 'దసరా' సినిమాతో హిట్ కొట్టిన కీర్తి సురేశ్
  •  త్వరలో థియేటర్లకు రానున్న 'భోళా శంకర్' 
  • తమిళంలో వరుస సినిమాలతో బిజీ 
  • మలయాళంలోను పాగా వేసే ప్రయత్నాలు

కీర్తి సురేశ్ ఆ మధ్య వరుస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైనా, నిదానంగా ఆ ట్రాకులో నుంచి బయటపడటానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. 2022లో 'సర్కారువారి పాట' సినిమాతో హిట్ అందుకున్న కీర్తి, ఈ ఏడాది 'దసరా' సినిమాతో మరో హిట్ ను నమోదు చేసింది. ఈ సినిమాలోని మాస్ పాత్రలో ఆమె ఒక రేంజ్ లో మెప్పించింది. ఇక ఇదే ఏడాది 'భోళా శంకర్' సినిమాతో ఆమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె మెగాస్టార్ కి చెల్లెలిగా కనిపించనుంది. టాలీవుడ్ లోని టాప్ త్రీ హీరోయిన్స్ లో ఒకరుగా చక్రం తిప్పుతున్న కీర్తి, ఈ సినిమాలో చెల్లెలి పాత్రకి అంగీకరించడం విశేషం. అలాంటి కీర్తి ఈ మధ్య ఎప్పటికప్పుడు ఫొటో షూట్ లు చేస్తూ, అభిమానులను మరింత ఉత్సాహపరుస్తూ వెళుతోంది. ఆమె వాలు చూపుల వలలోనే కుర్రాళ్లంతా చిక్కుకుంటున్నారు. ఇక తమిళంలో వరుసగా మూడు సినిమాలు చేస్తున్న కీర్తి, మలయాళంలోను పాగా వేయడానికి తగిన సన్నాహాలు చేసుకుంటూ వెళ్లడం విశేషం.

Keerthi Suresh
Actress
Tollywood
  • Loading...

More Telugu News