Adipurush: ఆదిపురుష్​ నుంచి ‘రాం సీతా రాం’ వీడియో సాంగ్ వచ్చేసింది

Ram Sita Ram Full Song from Adipurush

  • సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి
  • జూన్16న విడుదల కానున్న చిత్రం
  • ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర బృందం

ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆది పురుష్’. జూన్ 16న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీ సనన్ సీత పాత్ర పోషించింది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ లో జోరు పెంచింది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్‌తో పాటు వరుసగా పాటలు వదులుతోంది. ఈ క్రమంలో ఈ రోజు సినిమా నుంచి ‘రాం సీతా రాం వీడియో పాటను విడుదల చేసింది. 

‘నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో’ అని సీత పాత్రధారి కృతీ సనన్‌కు ప్రభాస్ చెబితే.. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలివెళ్తుందేమో.. ఈ జానకి వెళ్లదు’ అని ఆమె బదులిస్తుంది. ‘ఆదియు అంతము రాముడిలోనే.. మా అనుబంధం రాముడితోనే’ అంటూ మొదలైన పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, మంచి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

వనవాసానికి వచ్చిన సమయంలో రాముడు, సీత ఒకరినొకరు అర్థం చేసుకున్న విధానం, సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిన తర్వాత ఇద్దరూ పడ్డ మథనాన్నిదర్శకుడు అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషించారు.
.

Adipurush
Prabhas
krithi sanan
Bollywood
Tollywood
video song

More Telugu News