Bellamkonda Ganesh: స్పీడ్ గానే వచ్చేస్తున్న స్టూడెంట్!

Nenu Student Sir movie update

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'నేను స్టూడెంట్ సర్'
  • జూన్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
  • కథానాయికగా అవంతిక పరిచయం 
  • కీలకమైన పాత్రను పోషించిన సముద్రఖని

బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్' సినిమా రూపొందింది. 'నాంది' సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఈ పాటికే థియేటర్లకు ఈ సినిమా రావలసింది. కానీ సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ వచ్చారు. చాలా తక్కువ సమయం ఉండగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జూన్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో హీరో ఇంజనీరింగ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. అతను కొనుక్కున్న ఖరీదైన ఫోన్ కనిపించకుండా పోతుంది. ఆ ఫోన్ ను పోలీసులే కాజేశారంటూ అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. ఇంతవరకూ అర్థమయ్యేలా ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో అందరిలో ఆసక్తి పెరిగిపోతూ వెళ్లింది. 

కథానాయికగా ఈ సినిమాతో అవంతిక దాసాని పరిచయమవుతోంది. తను బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు. ఇక కీలకమైన పాత్రలో సముద్రఖని కనిపించనున్నాడు. ఒక ప్రత్యేకమైన పాత్రను సునీల్ పోషించాడు. 'స్వాతిముత్యం' సినిమాలో అమాయకుడిగా మెప్పించిన బెల్లంకొండ గణేశ్, స్టూడెంట్ పాత్రలో ఎలా మెప్పిస్తాడనేది చూడాలి. 

Bellamkonda Ganesh
Avanthika
Samudrakhani
  • Loading...

More Telugu News