: ఆయన సరదాల ఖర్చు రూ.110 కోట్లు!
సరదాలు తీర్చుకోవడం కోసం చాలామంది చాలానే ఖర్చు పెడుతుంటారు. అయితే ఆయనగారు తన సరదాల కోసం చేసిన ఖర్చు మాత్రం అక్షరాలా రూ.110 కోట్లు. ఏంటీ సరదాలకోసం అంత ఖర్చా...? అని నోరెళ్లబెట్టకండి. అంతే ఖర్చయింది. ఇంతకీ ఆ సరదాల రాయుడు ఎవరనుకుంటున్నారా...? ఆయన ఒక రాకుమారుడు. సౌదీ రాకుమారుడు ఫహద్`అల్`సౌద్. ఆయన తన మిత్రులతో కలిసి డిస్నీ ల్యాండ్‌లో మూడు రోజుల పాటు పండుగ చేసుకున్నాడు.
పాపం డిస్నీ ల్యాండ్ ఏర్పాటు చేసి ఇప్పటికి 20 ఏళ్లవుతున్నాయి. అయినా ఏనాడు కూడా ఈ పార్కు లాభాలను కళ్లజూసింది లేదు. అయితే సౌదీ రాకుమారుడు ఈ పార్కును మే 22 నుండి 24 వరకూ బుక్ చేసుకున్నారు. ఈ పార్కులో మనకు నచ్చిన థీమ్‌లను ఏర్పాటు చేసుకునే వీలుంది. ఇలాంటి పార్కును ఆయన బుక్ చేసుకున్నారు. రాకుమారుడు ఇచ్చిన ఆతిధ్యానికి 60 మంది అతిధులు విచ్చేశారు. దీంతో పార్కులో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు మూడు రోజుల పాటు ఆహూతులను ప్రత్యేక కార్యక్రమాలతో నిర్వాహకులు అలరించారు. ఈ విలాసవంతమైన విందుకు అయిన ఖర్చు మాత్రం అక్షరాలా రూ.110 కోట్లు. దీంతో డిస్నీ ల్యాండ్ వాళ్లు తెగ సంతోషపడిపోతున్నారట.!