Telangana: తెలంగాణలో మరోసారి ఓటర్ల జాబితా సవరణ

Voter list verification in Telangana

  • జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే
  • ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
  • ఆగస్టు 31 వరకూ ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ 
  • అక్టోబర్ 10న తుది జాబితా విడుదల
  • అక్టోబర్ 1కి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం

ఎన్నికల సంఘం మరోసారి తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణకు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 23 వరకూ ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. అనంతరం, పోలింగు కేంద్రాలను పరిశీలించి హేతుబద్ధీకరణ చేపడతారు. ఆ తరువాత ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. దీనిపై ఆగస్టు 31 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు చేర్పుల కోసం వచ్చే దరఖాస్తులను సెప్టెంబర్ 22లోపు పరిష్కరించి అక్టోబర్ 10న తుది జాబితా విడుదల చేస్తారు. 

అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వారందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల నమోదు కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News