: కృత్రిమ కాలేయాన్ని తయారు చేయవచ్చు!
మానవుని శరీరంలోని పలు అవయవాలను కృత్రిమంగా రూపొందించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ కృషిలో భాగంగా మసాచ్చుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు కృత్రిమ కాలేయాన్ని రూపొందించడంలో విజయం సాధించారు. నిజానికి కాలేయానికి పునరుజ్జీవించే అద్భుతమైన శక్తి ఉంది. అయితే ఈ శక్తి ఆధారంగా కాలేయంలోని హెటోసైట్స్‌గా పేర్కొనే కణాలను శరీరం నుండి వేరు చేసిన కొద్దిసేపట్టికే అవి నిష్ప్రయోజనంగా మారిపోతాయి. దీంతో శాస్త్రవేత్తలకు పరిశోధనలకు కష్టంగా ఉండేది.
శాస్త్రవేత్తలు కృత్రిమ కాలేయం తయారీకి ఉపయోగించే 12 రసాయనాల మిశ్రమం చేసి దీనిలో కాలేయ కణాలను ఉంచారు. దీంతో కాలేయ కణాలు నిష్ప్రయోజనం కాకుండా ఈ రసాయన మిశ్రమాలు కాపాడాయి. ఈ కణాలు ప్రయోగశాలలోనే పూర్తిస్థాయిలో పెరిగేందుకు రసాయన మిశ్రమాలు తోడ్పడ్డాయి. రసాయనాల వల్ల కాలేయకణాలు వాటి సహజ లక్షణాలను కోల్పోకుండా సరికొత్త కణజాల ఉత్పత్తికి చురుకుగా తోడ్పడ్డాయి. దీంతో కృత్రిమ కాలేయం రూపొందింది.