Tollywood: భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి: బండ్ల గణేశ్​​

Bandla Ganesh tweets against star director once again
  • రెండు రోజులుగా గురూజీ అంటూ ట్వీట్లు చేస్తున్న ప్రొడ్యూసర్
  • బడా డైరెక్టర్ ను టార్గెట్ చేశాడని టాలీవుడ్ లో టాక్
  • తాజాగా మరో రెండు ట్వీట్లు చేసిన బండ్ల 
టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి ‘గురూజీ’ అంటూ ట్విట్టర్లో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఓ స్టార్ డైరెక్టర్ను టార్గెట్ చేసి గణేశ్ కొన్ని రోజులుగా విమర్శలు చేస్తున్నారని టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. తాను దేవుడిగా కొలిచే ఓ అగ్ర హీరోకు, తనకు మధ్య దూరం పెరగడానికి సదరు దర్శకుడి వల్లే దూరం పెరిగిందని బండ్ల చెబుతున్నారని వినికిడి. దానికి మరింత బలం చేకూరేలా బండ్ల శనివారం ఉదయం రెండు ట్వీట్లు చేశారు. 

‘సాగినంత కాలం నా అంతవాడు లేడందురు. సాగకపోతే ఊరక చతికిత పడిపోవదురు. చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం గురూజీ’ అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ‘భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్‌ బత్తి. భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్‌ సుత్తి’ అని బండ్ల చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది.
Tollywood
bandla ganesh
tweet

More Telugu News