Jagan: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ

CM Jagan met union finance minister Nirmala Sitharaman
  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్
  • నిర్మలా సీతారామన్ తో 40 నిమిషాల పాటు సమావేశం
  • పెండింగ్ నిధుల విడుదలపై కృతజ్ఞతలు
  • మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కోరిన సీఎం 
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఆమెతో సీఎం జగన్ 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, నిధులు, పలు ప్రాజెక్టుల అంశాలపై ఆమెతో చర్చించినట్టు తెలుస్తోంది. 

ఇటీవల కేంద్రం రూ.10 వేల కోట్ల రెవెన్యూ లోటు నిధులు విడుదల, ఇతర పెండింగ్ నిధుల విడుదలను పురస్కరించుకుని కేంద్ర మంత్రి నిర్మలకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. 

కాగా, తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్ మెంట్ కోరారు. సీఎం జగన్ రేపు హస్తినలో నిర్వహించే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు.
Jagan
Nirmala Sitharaman
New Delhi
YSRCP
Andhra Pradesh

More Telugu News