YS Avinash Reddy: హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లి... ఆసుపత్రిలోనే ఉన్న అవినాశ్

YS Avinash Reddy mother admitted in Hyderabad AIG hospital
  • కర్నూలు ఆసుపత్రి నుంచి ఉదయం డిశ్చార్జ్ అయిన అవినాశ్ తల్లి
  • మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు
  • చంచల్ గూడ జైల్లో అస్వస్థతకు గురైన అవినాశ్ తండ్రి
కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి నుంచి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మిని డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ఆమెను అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. తన తల్లితో పాటు అవినాశ్ రెడ్డి కూడా హైదరాబాద్ కు వచ్చారు.  ప్రస్తుతం ఆయన కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. 

మరోవైపు అవినాశ్ రెడ్డి తండ్రి కూడా అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరగడంతో ఆయనను చంచల్ గూడ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం రేపు నిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు.
YS Avinash Reddy
YSRCP
Mother
Father

More Telugu News