YS Avinash Reddy: జైల్లో అస్వస్థతకు గురైన అవినాశ్ రెడ్డి తండ్రి.. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స

YS Bhaskar reddy fell in jail

  • చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డి
  • బీపీ పెరగడంతో అస్వస్థతకు గురైన వైనం
  • చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించిన అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈరోజు ఆయనకు ఒక్కసారిగా బీపీ పెరిగింది. దీంతో ఆయనను జైలు సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలించారు. మరోవైపు వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

YS Avinash Reddy
Father
Bhaskar Reddy
YSRCP
Health
  • Loading...

More Telugu News