Kishan Reddy: బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా?: కిషన్ రెడ్డి

kishan reddy fires on cm kcr

  • తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలన్న కిషన్ రెడ్డి
  • బీఆర్ఎస్‌తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని వ్యాఖ్య
  • ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం రాకపోవడం సిగ్గుచేటని విమర్శ

తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ ను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఆగిపోతుందా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌తో నీతులు చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని అన్నారు.

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. రేపటి నీతి ఆయోగ్ సమావేశానికి దూరంగా ఉండటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.

పోరాడి సాధించుకున్న తెలంగాణ.. కేసీఆర్ వైఖరి కారణంగా నష్టపోతోందని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘ప్రధాని అధికారిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రాకపోవడం సిగ్గుచేటు. మహారాష్ట్రకు వెళ్లటానికి తీరిక ఉంది కానీ.. అంబేద్కర్‌, జగ్జీవన్ రామ్ జయంతికి పూలమాల వేయటానికి కేసీఆర్‌కు తీరికలేదా?’’ అని నిలదీశారు. అవకాశం ఉన్న చోట తెలంగాణ వాయిస్ వినిపించటంలో కేసీఆర్ విఫలం అయ్యారని, ప్రభుత్వాల మధ్యలో ఘర్షణాత్మక వైఖరి వల్ల తెలంగాణకు నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.

Kishan Reddy
KCR
Governor
Parliament
New Parliament Building Inauguration
Secretariat
BRS
BJP
  • Loading...

More Telugu News