GO 111: జీవో 111 ఎత్తివేత పరిణామాలపై అధ్యయనానికి ఏడుగురితో కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్
- జంట జలాశయాలకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్న కాంగ్రెస్
- అధ్యయనం కోసం కోదండరెడ్డి నేతృత్వంలో కమిటీ
- కమిటీలో ఇద్దరు నిపుణులు కూడా
తెలంగాణ ప్రభుత్వం జీవో 111ను రద్దు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు జీవో ఎత్తివేతతో చోటుచేసుకునే పరిణామాలపై అధ్యయనానికి టీకాంగ్రెస్ ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మాజీ మంత్రి కోదండరెడ్డి నేతృత్వం వహిస్తారు. మాజీ మంత్రి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరో ఇద్దరు నిపుణులను కమిటీలో చేర్చారు. జీవో 111 ఎత్తివేత ప్రాంతంలో ఎంత మంది రాజకీయ నేతలకు భూములున్నాయనే విషయాన్ని కూడా ఈ కమిటీ పరిశీలించబోతోంది. ఈ జీవో ఎత్తివేత వల్ల హైదరాబాద్ లోని జంట జలాశయాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.