ponniyin selvan 2: ఓటీటీలోకి పొన్నియన్ సెల్వన్-2.. కానీ షరతులు వర్తిస్తాయి!

ponniyin selvan 2 movie streaming now on amazon prime

  • అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్-2 
  • అయితే సినిమా చూసేందుకు రూ.399 ఫీజు పెట్టిన ప్రైమ్
  • అది కూడా 48 గంటల్లోపు చూసేయాలని షరతు

థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’ ఓటీటీలోకి వచ్చేసింది. ముందస్తు ప్రకటన లేకుండానే సైలెంట్ గా గురువారం రాత్రి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రత్యక్షమైంది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. 

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నప్పటికీ పొన్నియన్ సెల్వన్-2ను ఉచితంగా చూడటానికి లేదు. ఈ సినిమాను చూసేందుకు ‘రెంట్‌’ కింద డబ్బులు కట్టాల్సిందే. ప్రైమ్ మెంబర్‌ షిప్‌ ఉన్న వాళ్లు కూడా రూ.399 చెల్లించిన తర్వాతే చూసేందుకు అవకాశం ఉంటుంది. క్యాష్‌ బ్యాక్‌ రూపంలో రూ.100 వెనక్కి ఇచ్చే ఆఫర్‌ను పెట్టింది. అలా చూసుకున్నా రూ.299 పెట్టాలి.

పోనీ ఇంతా ఖర్చు పెట్టి రెంట్‌కు తీసుకున్నా.. ప్రైమ్ మరో షరతు పెట్టింది. అదేంటంటే సినిమా చూడటం మొదలు పెట్టిన 48 గంటల్లోనే పూర్తిగా చూసేయాలి. ఆ తర్వాత లింక్‌ పనిచేయదు. మళ్లీ చూడాలంటే మళ్లీ డబ్బు చెల్లించాల్సిందే.

కల్కి రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించారు. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష వంటి స్టార్లు ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు. తమిళంలో అంతో ఇంతో ఆడిన ఈ సినిమా.. మిగతా భాషల్లో మాత్రం నిరాశపరిచింది.

ponniyin selvan 2
amazon prime
ponniyin selvan
Vikaram
karti
Mani Ratnam
  • Loading...

More Telugu News