YS Avinash Reddy: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి.. హెల్త్ బులెటిన్ విడుదల

YS Avinash Reddy mother health bulletin

  • కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవినాశ్ తల్లి
  • ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
  • గుండె సంబంధిత చికిత్స కోసం మెరుగైన ఆసుపత్రికి తరలిస్తున్నట్టు వెల్లడి

కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి కర్నూలు లోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆసుపత్రి వైద్యులు ఆమె హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. లక్ష్మిగారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేస్తామని బులెటిన్ లో వైద్యులు తెలిపారు. ఆమె గుండెకు సంబంధించి చికిత్స అవసరమని, దీనికి సంబంధించి మెరుగైన ఆసుపత్రికి షిఫ్ట్ చేయబోతున్నట్టు చెప్పారు. మరోవైపు, అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఆయన బెయిల్ విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

YS Avinash Reddy
Mother
Health Bulletin
  • Loading...

More Telugu News