Recording App: ప్రమాదకర రికార్డింగ్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్

Google removes dangerous recording app from play store

  • ఓ రికార్డింగ్ యాప్ పై గూగుల్ వేటు
  • ఐరికార్డర్-స్క్రీన్ రికార్డర్ యాప్ తొలగింపు
  • ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నట్టు గుర్తింపు

టెక్ దిగ్గజం గూగుల్ ఓ ప్రమాదకర యాప్ ను గుర్తించి, దాన్ని ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఇది ఒక రికార్డింగ్ యాప్. దీని పేరు ఐరికార్డర్-స్క్రీన్ రికార్డర్. దీన్ని ఒకసారి డౌన్ లోడ్ చేసుకుంటే, కొరివితో తల గోక్కున్నట్టేనని సైబర్ భద్రతా సంస్థలు చెబుతున్నాయి. ఈ యాప్ ప్రతి 15 నిమిషాలకు ఓసారి ఆడియో రికార్డింగ్ చేసి తన డెవలపర్ కు పంపిస్తున్నట్టు గుర్తించారు. 

ఈ యాప్ ను 2021 సెప్టెంబరులో తీసుకురాగా, ఇప్పటివరకు 50 వేల మందికి పైగా ఇన్ స్టాల్ చేసుకున్నారు. ప్రారంభంలో ఇది ప్రమాదకరంగా ఏమీ లేదని, కానీ 2022 ఆగస్టులో ఈ యాప్ 13.8 వెర్షన్ లో డెవలపర్ ప్రమాదకర కోడ్ ను పొందుపరిచాడని సైబర్ పరిశోధకుడు లూకాస్ స్టెఫాంకో వెల్లడించారు. 

ఇది ఫోన్ లో ఉన్న కాల్ లాగ్స్, కాంటాక్ట్స్ లోకి చొరబడుతుందని, టెక్ట్స్ మెసేజులు, ఫైల్స్ లిస్ట్, డివైస్ లొకేషన్, ఎస్సెమ్మెస్ లు పంపడం, ఆడియో రికార్డింగ్, ఫొటోలు తీయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతుందని వివరించారు. మొబైల్ లోని మైక్రోఫోన్ ను తన అధీనంలోకి తెచ్చుకుని ఆడియో రికార్డ్ చేస్తుందని, ఫోన్ లోని ప్రత్యేకమైన ఫైళ్లను కూడా తస్కరిస్తుందని స్టెఫాంకో వివరించారు.

Recording App
Google
Play Store
  • Loading...

More Telugu News