Saitej: 'విరూపాక్ష' కథలో ఆ కీలకమైన మార్పు సుకుమార్ చేశాడట!
- 100 కోట్లు రాబట్టిన 'విరూపాక్ష'
- ఆ సినిమా హిట్ గురించి ప్రస్తావించిన డైరెక్టర్
- తాను రాసుకున్న కథను గురించిన ప్రస్తావన
- సుకుమార్ చేసిన మార్పును గురించి వివరణ
సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా రూపొందిన 'విరూపాక్ష' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సాయితేజ్ కెరియర్లో 100 కోట్ల సినిమాగా నిలిచింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, సుకుమార్ కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించాడు. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, 27 రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.
అలాంటి ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చాడు. నేను రాసుకున్న కథ ప్రకారం .. ఈ సినిమాలో పార్వతి (యాంకర్ శ్యామల) నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించాలి. అయితే ఆ నెగెటివ్ షేడ్స్ హీరోయిన్ పాత్రలో ఉండేలా సుకుమార్ గారు కథను మార్చారు. అదే ఈ సినిమాకి కలిసొచ్చిన అంశం అయింది" అని అన్నాడు.
ఈ సినిమాలో పార్వతి పాత్రకు .. హీరో పాత్రకు మధ్య బంధుత్వం ఉంటుంది. హీరో అంటే పార్వతి విపరీతమైన అభిమానాన్ని చూపిస్తుంది. క్లైమాక్స్ లో థ్రిల్ ఫీలయ్యేలా చేయడం కోసమే దర్శకుడు కథను అలా అల్లుకున్నాడన్నమాట. కానీ సుకుమార్ చేసిన మార్పు చాలా కీలకమైనదనే చెప్పాలి. క్లైమాక్స్ సీన్ హీరో, హీరోయిన్ పై ఉండటమే కరెక్ట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అదే అనిపిస్తుంది.