Revanth Reddy: రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందే: యాదవ జేఏసీ
- మంత్రి తలసానిపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం
- గత కొన్నిరోజులుగా నిరసనలు చేపడుతున్న యాదవ జేఏసీ
- రేవంత్ రెడ్డికి విధించిన డెడ్ లైన్ గత అర్ధరాత్రితో ముగిసిన వైనం
- నేడు గాంధీ భవన్ ముట్టడికి గొల్ల, కురుమల నిర్ణయం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యాదవ జేఏసీ మండిపడుతోంది. తన వ్యాఖ్యలకు గాను రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. జేఏసీలో భాగంగా ఉన్న గొల్ల, కురుమలు రేవంత్ రెడ్డికి విధించిన డెడ్ లైన్ గత అర్ధరాత్రితో ముగిసింది.
తమ డిమాండ్ పట్ల రేవంత్ రెడ్డి స్పందించకపోవడంతో గొల్ల, కురుమలు రోడ్డెక్కారు. నేడు ఇందిరా పార్క్ నుంచి ర్యాలీగా వెళ్లి గాంధీభవన్ ను ముట్టడించాలని యాదవ జేఏసీ నిర్ణయించింది. తలసానిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ యాదవ జేఏసీ కొన్నిరోజులుగా నిరసన ప్రదర్శనలు చేపడుతోంది. పలు చోట్ల రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.