Karthi: ‘జపాన్’ ఇంట్రడక్షన్ అదిరిందిగా.. మీరూ చూసేయండి!

karthi stylish japan introduction video is out

  • కార్తీ పుట్టినరోజు కానుకగా జపాన్ సినిమా టీజర్ రిలీజ్
  • క్రేజీ లుక్‌ లో కనిపించిన కార్తీ.. మరోసారి విలన్ గా సునీల్!
  • దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనున్న మూవీ

‘సర్దార్’ సినిమాతో ఇటీవల హిట్ అందుకున్నాడు టాలెంటెడ్ హీరో కార్తీ. దాని తర్వాత చేస్తున్న మరో డిఫరెంట్ సినిమానే ‘జపాన్’. కార్తీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్తదనంతో కూడిన స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొచ్చే కార్తీ.. ఈసారి కూడా వెరైటీ సబ్జెక్టును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 

జపాన్ ఎంట్రీ వీడియో పేరుతో మేకర్స్ చేసిన ట్వీట్ లో ‘మా జపాన్ వచ్చేశాడు.. మేడిన్ ఇండియా’ అంటూ పేర్కొన్నారు. ఇక టీజర్ లో.. ‘‘మీరనుకుంటున్నట్టు కాదు.. వాడు దూల తీర్చే విలన్‌’’ అంటూ సునీల్ చెబుతున్న డైలాగ్స్‌తో స్టైలిష్‌ ఎంట్రీ ఇచ్చాడు కార్తీ. ఆయన క్రేజీ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. టీజర్ చివర్లో పోలీసులు చుట్టుముట్టడం, కార్తీ తల ఆడిస్తూ కూర్చుకోవడం.. ఆయన పళ్లకు క్లిప్.. ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సునీల్ మరోసారి డిఫరెంట్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ అను ఇమ్మానుయేల్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుండగా టీజర్ అంతా డిఫరెంట్ గా ఉంది.

దర్శకుడు రాజు మురుగన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తుండగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తాజా వీడియోతో ప్రకటించేశారు.

More Telugu News