malli pelli: ‘మళ్లీ పెళ్లి’ విడుదల ఆపండి.. కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి

actor naresh third wife ramya raghupathi approaches the court to stop the release of malli pelli movie

  • నరేశ్, పవిత్ర జంటగా రూపొందిన 'మళ్లీ పెళ్లి'  
  • తన ప్రతిష్టను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ రమ్య రఘుపతి అభ్యంతరం 
  • కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్

రేపు విడుదల కానున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు.

సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. నరేశ్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More Telugu News