Sudhakar: నాపై వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి: సీనియర్ సినీ నటుడు సుధాకర్

Actor Sudhar response on death news

  • సుధాకర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • తాను ఆరోగ్యంగానే ఉన్నానన్న సుధాకర్
  • తనపై వస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని వ్యాఖ్య

సీనియర్ సినీ నటుడు సుధాకర్ చనిపోయారంటూ ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుధాకర్ స్పందించారు. తాను చనిపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఇలాంటి తప్పుడు వార్తలను దయచేసి నమ్మకండని కోరారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు వార్తలేనని చెప్పారు. 

మరోవైపు సుధాకర్ పై ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2010లో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన కోమాలోకి కూడా వెళ్లారు. ఆయన చనిపోయారంటూ అప్పుడు కూడా తప్పుడు ప్రచారం జరిగింది. వైద్య చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనపై అలాంటి ప్రచారమే జరుగుతోంది.

Sudhakar
Tollywood
  • Loading...

More Telugu News