Ram: అపజయాలతో అవస్థలు పడుతున్న యంగ్ హీరోలు!

Young Heros Special

  • 'ఇస్మార్ట్ శంకర్' తరువాత హిట్ లేని రామ్ 
  • 'భీష్మ' తరువాత నితిన్ ను పలకరించని సక్సెస్ 
  • సరైన హిట్ కోసం చైతూ .. అఖిల్ వెయిటింగ్ 
  • స్పీడ్ తగ్గకుండా చూసుకుంటున్న నాగశౌర్య - కార్తికేయ

బలమైన సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా, ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఫ్యామిలీ నుంచి వచ్చినా ఇక్కడ కావలసింది సక్సెస్. అదే ఇక్కడ మాట్లాడుతుంది .. అదే ఇక్కడ పోట్లాడుతుంది. సక్సెస్ లేకపోతే ఇక్కడ మార్కెట్ పడిపోవడానికి ఎక్కవ సమయం పట్టడం లేదు. అందువలన కొత్త కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ను అలరించడానికి యంగ్ హీరోలంతా నానా అవస్థలు పడుతున్నారు. ఒక సినిమా పోయినా మరో సినిమాతో నాని .. ఆ తరువాత వరుసలో నిఖిల్ నిలబడుతూ వస్తున్నారుగానీ, మిగతా హీరోలు చాలామంది సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తరువాత రామ్ కీ .. 'భీష్మ' తరువాత నితిన్ కి హిట్ లేదు. ఇక శర్వానంద్ కి సరైన హిట్ లేక చాలాకాలమే అయింది. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో వాళ్లంతా ఉన్నారు. ఇక కొంతకాలంగా అఖిల్ .. చైతూ .. నాగశౌర్య పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నారుగానీ, సక్సెస్ ను మాత్రం లాక్కురాలేకపోతున్నారు. మరో వైపున సుధీర్ బాబు .. కార్తికేయ పరిస్థితి కూడా అంతే ఉంది. వీళ్లంతా సాధ్యమైనంత త్వరగా ఒక సక్సెస్ ను తమ ఖాతాలో వేసుకుని, ఈ రేసులో తమ స్థానాన్ని కాపాడుకోవాలనే తపనతో ఆగకుండా పరిగెడుతూనే ఉన్నారు.

Ram
Nithin
Sharwanand
Akhil
Chaitu
  • Loading...

More Telugu News