Mahesh Babu: ఆ రెండు టైటిల్స్ పైనే దృష్టి పెట్టిన త్రివిక్రమ్!

Trivikram and Mahesh Babu movie update

  • షూటింగు దశలో త్రివిక్రమ్ తాజా చిత్రం
  • కెరియర్ పరంగా మహేశ్ కి ఇది 28వ సినిమా
  • టైటిల్ విషయంలో ఇంతవరకూ లేని స్పష్టత  
  • 'గుంటూరు కారం' టైటిల్ ఖరారైనట్టు టాక్

మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో అనేక ప్రత్యేకతలు .. విశేషాలు ఉండేలా త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. గతంలో త్రివిక్రమ్ నుంచి వచ్చిన సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలోను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉండేలా చూసుకున్నారని టాక్. 

ఈ సినిమా కోసం నాలుగు టైటిల్స్ ను పరిశీలించారు. వాటిలో రెండు టైటిల్స్ వైపు ఎక్కువమంది మొగ్గు చూపించారు. ఒకటి 'అయోధ్యలో అర్జునుడు' అయితే, మరొకటి 'గుంటూరు కారం'. ఈ కథ అంతా కూడా గుంటూరు నేపథ్యంగా నడుస్తుంది. అందువలన 'గుంటూరు కారం' టైటిల్ కరెక్ట్ అనే అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇది ఒక సినిమా టైటిల్ లా అనిపించడం లేదనే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. 

ఇక త్రివిక్రమ్ కి టైటిల్స్ పరంగా ఉండవలసిన సెంటిమెంట్ ఉండనే ఉంది. ఆయన సినిమా టైటిల్స్ 'అ' అక్షరంతో మొదలవుతాయి. అందువలన అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ ను ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ టైటిల్ అయితే ఆలోచింపజేసేదిగా .. ఆసక్తిని రేకెత్తించేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపున 'గుంటూరు కారం' ఖరారైపోయిందనే ప్రచారం జోరుగానే జరుగుతోంది.

More Telugu News