Nurse: హైదరాబాదులో మొండెం లేని తల... ఎవరిదంటే...!

Police busted torso less head case

  • మలక్ పేట వద్ద మూసీ నదిలో మహిళ తల లభ్యం
  • కేసును ఛేదించిన పోలీసులు
  • ఆ మహిళ ఓ నర్సు అని వెల్లడి
  • ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యజమానే హంతకుడు
  • రూ.18 లక్షల అప్పు తీర్చాలని అడగడంతో హత్య

హైదరాబాదులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇటీవల మలక్ పేట పీఎస్ పరిధిలో ఓ మొండెం లేని తల తీవ్ర కలకలం రేపింది. మూసీ నది వద్ద తల దొరకగా, అది ఓ మహిళ తల అని వెల్లడైంది. ఈ కేసుపై తీవ్రస్థాయిలో దృష్టి సారించిన పోలీసులు మృతురాలు ఓ నర్సు అని గుర్తించారు. పోలీసులు కొద్ది వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు. 

ఆమె పేరు ఎర్రం అనురాధ. కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. చైతన్యపురి కాలనీలో నివాసం ఉంటోంది. ఇంటి యజమాని చంద్రమౌళే హంతకుడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది. చంద్రమౌళి ఆన్ లైన్ ట్రేడింగ్ తో తీవ్రంగా నష్టపోయాడు. దాంతో, తన ఇంట్లో అద్దెకు ఉంటున్న నర్సు అనురాధ వద్ద రూ.18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 

అనురాధ వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇంటి యజమానికి కూడా అప్పు ఇచ్చింది. అయితే, చంద్రమౌళి ఎంతకీ అప్పు తీర్చకపోవడంతో డబ్బు తిరిగివ్వాలని ఒత్తిడి చేసింది. దాంతో చంద్రమౌళి... పక్కా ప్లాన్ తో నర్సు అనురాధను హత్య చేశాడు. అందుకోసం కొన్ని వీడియోలు కూడా చూశాడు.

మొండెం నుంచి తలను వేరుచేసి మూసీ నదిలో విసిరేశాడు. ఇతర శరీర భాగాలను చికెన్ కొట్టే కత్తితో ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచాడు. వాసన రాకుండా కర్పూరం, కొన్ని కెమికల్స్ వినియోగించాడు. నర్సు బతికే ఉందని నమ్మించేందుకు ఆమె ఫోన్ ను కూడా ఉపయోగించాడు. ఈ హత్యకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారు.

Nurse
Head
Torso
Murder
House Owner
Malakpet
Musi River
Police
Hyderabad
  • Loading...

More Telugu News