Satyakumar: గొడ్డలి వేటును గుండెపోటుగా మార్చిన వారిని అరెస్ట్ కాకుండా ఆపలేరు: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్

BJP not stopping Avinash Reddy arrest says Satyakumar

  • అవినాశ్ అరెస్ట్ ను అడ్డుకుంటున్న అజ్ఞాత వ్యక్తి జగన్ అన్న సత్యకుమార్
  • అరెస్ట్ ను బీజేపీ ఆపుతోందనే ప్రచారంలో నిజం లేదని వ్యాఖ్య
  • పొత్తులు ఎన్నికల ముందు నిర్ణయమవుతాయని వెల్లడి

అవినాశ్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకుంటున్న అజ్ఞాత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. గొడ్డలి వేటును గుండెపోటుగా మార్చిన వారిని అరెస్ట్ కాకుండా ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా బీజేపీ ఆపుతోందనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. అరెస్ట్ ఆలస్యం కావడం సీబీఐ వ్యూహాత్మక వ్యవహారమని చెప్పారు.    
      
కర్ణాటకలో మైనార్టీ ఓట్లు పడటం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని అన్నారు. పొత్తులు ఎన్నికలకు ఒకటి, రెండు నెలల ముందు నిర్ణయమవుతాయని చెప్పారు. రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కలిగిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మీడియాలో చూపకపోవడం వల్లే... రాష్ట్రంలో బీజేపీ వెనుకబడిపోయిందని చెప్పారు.

Satyakumar
BJP
YS Avinash Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News