Ganta Srinivasa Rao: 27న జగన్ ఢిల్లీకి వెళ్లబోయేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు: గంటా శ్రీనివాసరావు

Ganta Srinivas Rao comments on Jagan

  • అవినాశ్ కోసం జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్న గంటా
  • అవినాశ్ అరెస్ట్ కు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్న
  • రూ. 2 వేల నోట్ల రద్దు మంచి నిర్ణయమని వ్యాఖ్య

ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లబోయేది కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ అవినాశ్ రెడ్డి కేసు కోసమే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పారు. అవినాశ్ రెడ్డి అంశం సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోందని అన్నారు. ఆయనను అరెస్ట్ చేయడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. 

తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే హైదరాబాద్ కు తీసుకెళ్లాలి కానీ కర్నూలుకు ఎందుకు తీసుకెళ్లారని అడిగారు. అవినాశ్ రెడ్డి ఆరు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని సజ్జల రామకృష్ణారెడ్డి చెపుతున్నారని... ఎన్ని సార్లు హాజరుకాలేదో కూడా ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 2 వేల నోట్ల రద్దు మంచి నిర్ణయమని... ఆ నోట్లు ఎవరి వద్ద ఉన్నాయో వారికి ఇబ్బంది ఉంటుందని చెప్పారు.

Ganta Srinivasa Rao
Telugudesam
Jagan
YS Avinash Reddy
YSRCP
  • Loading...

More Telugu News