Ranjitha: అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాను: హీరోయిన్ రంజిత తండ్రి అశోక్ కుమార్

Ashik Kumar Interview

  • సీనియర్ హీరోయిన్ గా వెలిగిన రంజిత 
  • ఆమె తండ్రి అశోక్ కుమార్ కూడా నటుడే 
  • సినిమాల కోసం పోలీస్ జాబ్ వదిలేసిన అశోక్ కుమార్ 
  • పొగడటం తనకి అలవాటు లేదంటూ వెల్లడి

నిన్నటి తరం కథానాయికలలో రంజిత ఒకరుగా కనిపిస్తుంది. మంచి హైటూ .. ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. తెలుగు .. తమిళ భాషల్లో అప్పట్లో ఆమెకి అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. ఆమె తండ్రి అశోక్ కుమార్ కూడా నటుడే. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

"అప్పట్లో నేను పోలీస్ ఆఫీసర్ గా హైదరాబాద్ లో పనిచేశాను. ఆ తరువాత ఆ జాబ్ మానేసి హోటల్ బిజినెస్ చేశాను .. అది కాస్త నష్టాలు తేవడంతో మానేశాను. మద్రాసు వెళ్లి సినిమాల్లో ప్రయత్నాలు చేశాను. 40 ఏళ్ల కెరియర్ లో కేవలం 25 సినిమాలు మాత్రమే చేశాను. విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా చేశాను" అని అన్నారు. 

"కొన్ని సినిమాల్లో నన్ను హీరోగా తీసుకున్నారు .. కానీ ఆ తరువాత తొలగించారు. పోలీస్ ఆఫీసర్ గా పనిచేసి ఉండటం వలన, నాకు పొగడటం అలవాటు లేకుండాపోయింది. ఇండస్ట్రీలోనేమో పొగిడితేనే గాని పనులు కావు. అందువలన నా జాబ్ మానేసినందుకు చాలా బాధపడ్డాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి తప్పుచేశాను అని ఎన్నోసార్లు అనుకున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Ranjitha
Ashok Kumar
Kollywood
  • Loading...

More Telugu News