IPL 2023: జీటీ-సీఎస్కే మ్యాచ్ కు రికార్డు స్థాయి వీక్షణలు
![JioCinema breaks all records concurrent viewership during CSK GT match](https://imgd.ap7am.com/thumbnail/cr-20230524tn646dc8560d1fe.jpg)
- రెండో ఇన్నింగ్స్ చివరి ఓవర్ల సమయంలో 2.5 కోట్ల మంది వీక్షణ
- ఈ సీజన్ లో ఇది గరిష్ఠ రికార్డు
- ఏప్రిల్ 17న సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా 2.4 కోట్ల వీక్షణలు
జియో సినిమాపై రికార్డు స్థాయి వీక్షణలు నమోదయ్యాయి. గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ మ్యాచ్ 1 మంగళవారం జరిగింది. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను జియో కలిగి ఉంది. జియో సినిమా యాప్ ద్వారా ఉచితంగా ఐపీఎల్ ను వీక్షించే అవకాశం కల్పించింది. దీంతో ఎక్కువ మంది చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మే 23న క్వాలిఫయర్ 1న మ్యాచ్ కు ఈ సీజన్ లోనే అత్యధిక వీక్షణలు వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.
‘‘జియో సినిమా ప్రతి రోజూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్లాట్ ఫామ్ పై వీడియో వీక్షణలు ఇప్పటికే 1300 కోట్లను దాటేశాయి. ఇది ప్రపంచ రికార్డు. స్ట్రీమింగ్ యాప్ పై రోజువారీ కొత్త యూజర్లు నమోదవుతున్నారు. ఒక్కో మ్యాచ్ కు ఒక్కో యూజర్ చూసే సమయం 60 నిమిషాలు దాటిపోయింది’’ అని జియో ప్రకటించింది.