Soori: జీ 5లో అందుబాటులోకి వచ్చిన 'విడుదల పార్టు 1'

Vidudala movie update

  • తమిళంలో ప్రశంసలు అందుకున్న 'విడుదలై '
  • తెలుగులోను మంచి మార్కులు తెచ్చుకున్న సినిమా 
  • నిన్నటి నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి 
  • ఇళయరాజా సంగీతం ప్రధానమైన ఆకర్షణ  

సూరి - విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన 'విడుదలై పార్టు 1' తమిళనాట మార్చి 31వ తేదీన విడుదలైంది. వెట్రి మారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఈ సినిమాను తెలుగులో ఏప్రిల్ 15వ తేదీన విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా ప్రశంసలను అందుకుంది. 

ఆల్రెడీ ఈ సినిమా తమిళ వెర్షన్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నటి నుంచి తెలుగు వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇక తెలుగు ప్రేక్షకులు జీ 5లో ఈ సినిమాను వీక్షించవచ్చు. వెట్రిమారన్ తనదైన స్టైల్లో సహజత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఈ సినిమాను ఆవిష్కరించిన తీరు అభినందనలు అందుకుంది. 

అడవికి సమీపంలోని ఒక గిరిజన గూడెం .. అక్కడి గిరిజనులపై పోలీస్ వారి ఆధిపత్యం .. వారిని ఎదిరించే ఒక తిరుగుబాటుదారుడు. తన ప్రేమ కోసం అతణ్ణి ఎదిరించడానికి ప్రయత్నించిన అమాయకుడైన పోలీస్ .. ఇదే ఈ సినిమా కథ. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఓటీటీ నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు రాబడుతుందో చూడాలి. 

Soori
Vijay Sethupathi
Vidudala Movie
  • Loading...

More Telugu News