Allu Arjun: త్రివిక్రమ్ తో నాలుగో సినిమాకి రెడీ అవుతున్న బన్నీ! 

Allu  Arjun in Trivikram Movie

  • త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన బన్నీ 
  • మరో ప్రాజెక్టు కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • కథానాయికగా తెరపైకి సంయుక్త మీనన్ పేరు 
  • 'పుష్ప 2' తరువాత బన్నీ చేసే సినిమా ఇదే

అల్లు అర్జున్ తన సినిమాలకి సంబంధించిన కథల ఎంపికలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. దాదాపు సీనియర్ స్టార్ డైరెక్టర్స్ తోనే తన సినిమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. 'నా పేరు సూర్య' ఫ్లాప్ తరువాత, త్రివిక్రమ్ తోనే సినిమా చేయాలనే పట్టుదలతో ఆయన చాలా రోజుల పాటు వెయిట్ చేశాడు. 'అల వైకుంఠపురములో' సినిమాతో అందుకు తగిన ఫలితం కూడా దక్కింది. 

ఆల్రెడీ త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బన్నీ, ఆయనతో మరో సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మరింత బలపడుతూ వెళుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందడం దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు. మహేశ్ తరువాత త్రివిక్రమ్ చేసే మూవీ బన్నీతోనే ఉంటుందని అంటున్నారు. 

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ 'పుష్ప 2' చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటితో చేయవలసి ఉంది. అయితే ఆయన 'అఖండ' సీక్వెల్ పనిలో పడే అవకాశాలు ఉన్నాయి. అందువలన త్రివిక్రమ్ తో ప్రాజెక్టును సెట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఒక కథానాయికగా సంయుక్త మీనన్ కనిపించనుందని అంటున్నారు. 

Allu Arjun
Samyuktha Menon
Trivikram Srinivas
  • Loading...

More Telugu News