Naresh: నరేశ్ అండగా నిలబడటం వల్లే నేను మళ్లీ బయటికి రాగలిగాను: పవిత్ర లోకేశ్

Pavitra Lokesh Interview

  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'మళ్లీ పెళ్లి'
  • ప్రమోషన్స్ లో బిజీగా పవిత్ర లోకేశ్ 
  • తనపై తప్పుడు ప్రచారం చేశారన్న పవిత్ర 
  • నరేశ్ వలన జనంలో కలిశానని వెల్లడి  

నరేశ్ - పవిత్ర లోకేశ్ జంటగా 'మళ్లీ పెళ్లి' సినిమా రూపొందింది. నరేశ్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. చాలా కాలం తరువాత నరేశ్ హీరోగా చేసిన సినిమా ఇది. ఆయన వయసుకి తగిన పాత్రనే ఆయన ఇందులో పోషించాడు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నరేశ్ - పవిత్ర బిజీగా ఉన్నారు.

తాజా ఇంటర్వూలో పవిత్ర లోకేశ్ మాట్లాడుతూ .. 'మళ్లీ పెళ్లి' సినిమా నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఈ కథ కల్పనలో నుంచి పుట్టిందా .. వాస్తవ సంఘటనల్లో నుంచి పుట్టిందా? అనేది నేను చెప్పను .. ఆ విషయం థియేటర్స్ కి వెళ్లి తెలుసుకోవలసిందే. తప్పకుండా ఈ కథతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు" అని అన్నారు. 

"కొంతమంది మా పరిస్థితులను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేశారు. నా కెరియర్ పై దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలి .. లేదంటే ఆత్మహత్య చేసుకోవాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో నరేశ్ అండగా నిలబడటం వల్లే నేను మళ్లీ బయటికి రాగలిగాను" అంటూ చెప్పుకొచ్చారు.

Naresh
Pavitra
Malli Pelli Movie
  • Loading...

More Telugu News