Paritala Sunitha: సొంత చెల్లికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత? లేకపోతే ఎంత?: పరిటాల సునీత

Paritala Sunitha fires on Jagan

  • సొంత చిన్నాన్నను హత్య చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారన్న సునీత
  • సీబీఐకి పోలీసులు సహకరించడం లేదని విమర్శ
  • టీడీపీ నేతల ఇళ్లలోకి మాత్రం అర్ధరాత్రులు దూరి అరెస్టులు చేస్తారని మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేకాను హత్య చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సొంత చెల్లెలికి కూడా న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత? లేకపోతే ఎంత? అని ప్రశ్నించారు. 

అవినాశ్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐకి సహకరించకుండా పోలీసులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను మాత్రం అర్ధరాత్రులు, తెల్లవారుజామున ఇళ్లలోకి దూరి అరెస్ట్ చేస్తారని దుయ్యబట్టారు. అవినాశ్ రెడ్డికి ఒక న్యాయం, ఎదుటి వ్యక్తులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా కూతురు సునీత తన తండ్రిని చంపిన వారిని చూపించినప్పటికీ శిక్షించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Paritala Sunitha
Telugudesam
YS Avinash Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News