Kodanda Reddy: తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీకి 10 సీట్లకు మించి రావు: కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి

Kodandareddy slams BJP

  • నోట్ల రద్దుకు మద్దతు పలికింది కేసీఆర్ అని కోదండరెడ్డి విమర్శ 
  • బండి సంజయ్ తమను వేలెత్తి చూపడం సరికాదని హితవు
  • నోట్ల రద్దును కాంగ్రెస్ వ్యతిరేకించిందని స్పష్టీకరణ

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి బీజేపీపై ధ్వజమెత్తారు. నాడు నోట్ల రద్దుకు, వ్యవసాయ చట్టాలకు మద్దతు పలికింది కేసీఆర్ అని, బండి సంజయ్ తమను వేలెత్తిచూపడం సరికాదని అన్నారు. నోట్ల రద్దును కాంగ్రెస్ వ్యతిరేకించిందని కోదండరెడ్డి స్పష్టం చేశారు. రాముడు, హనుమంతుడు బీజేపీకే సొంతం అన్నట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

"మతాన్ని అందరం గౌరవిస్తాం... కానీ బీజేపీ లాగా దేవుడ్ని రాజకీయాలకు వాడుకోం. కర్ణాటకలో మోదీ జై భజరంగబలి అన్నారు. మానవ సేవే మాధవ సేవ అంటున్నారు... బీజేపీ ఎప్పటికీ మానవ సేవ చేయదు" అని కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా 10 సీట్లకు మించి రావని, తెలంగాణలోనూ కర్ణాటక తరహా ఫలితాలే వస్తాయని అన్నారు.

Kodanda Reddy
Congress
Bandi Sanjay
BJP
Telangana
  • Loading...

More Telugu News