Moeen Ali: ధోనీలా ఉండాలంటే ఇతర కెప్టెన్లకు కష్టమే: మొయిన్ అలీ

Moeen Ali lauds Dhoni as a captain

  • ధోనీపై మొయిన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ధోనీ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాడని వెల్లడి
  • ఒకట్రెండు మ్యాచ్ ల్లో విఫలమైనా వారిని ప్రోత్సహిస్తాడని వివరణ

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మొయిన్ అలీ తమ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీలాగా ఇతర కెప్టెన్లు ఉండాలని ఆశించలేమని అభిప్రాయపడ్డాడు. 

ఆటగాళ్లు ఒకట్రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే జట్టు నుంచి తప్పించకుండా, వారికి అవకాశాలు ఇవ్వడం ధోనీకే సాధ్యమని అన్నాడు. ఆటగాడిలో సత్తా ఉందా? లేదా? అనేదే ధోనీకి ముఖ్యమని, చెన్నై సూపర్ కింగ్స్ సహాయక సిబ్బంది కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తారని మొయిన్ అలీ వివరించాడు. మిగతా జట్లకు, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య ఉన్న తేడాల్లో ఇదొకటని అన్నాడు. 

ఐపీఎల్ 16వ సీజన్ లో నిన్నటితో లీగ్ దశ పోటీలు ముగిశాయి. రేపటి నుంచి ప్లే ఆఫ్ దశ జరగనుంది. క్వాలిఫయర్-1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫయర్-2లో నెగ్గిన జట్టు ఫైనల్లో క్వాలిఫయర్-1 విజేతను ఢీకొంటుంది.

Moeen Ali
MS Dhoni
Captain
CSK
IPL
  • Loading...

More Telugu News