Jagan: పోలీసు శాఖ బకాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం... కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారులు
![AP govt releases pending payments for police dept](https://imgd.ap7am.com/thumbnail/cr-20230522tn646b83c409ded.jpg)
- చాలాకాలంగా పోలీసు శాఖకు బకాయిల పెండింగ్
- ఇటీవల రూ.554 కోట్లు విడుదల
- సీఎం జగన్ ను కలిసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు
పోలీస్ శాఖకు చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలను ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. పోలీసు శాఖకు చెందిన రూ.554 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాయంలో కలిశారు. బకాయిలు విడుదల చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
సీఎం జగన్ ను కలిసినవారిలో పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎండీ మస్తాన్ ఖాన్, ట్రెజరర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.