Nabha Natesh: చేపకళ్ల సొగసరి నభా నటేశ్ .. లేటెస్ట్ పిక్స్!

- గ్లామర్ క్వీన్ అనిపించుకున్న నభా
- 'ఇస్మార్ట్ శంకర్'తో దక్కిన భారీ హిట్
- ప్రమాదం కారణంగా కొంతకాలం పాటు సినిమాలకి దూరం
- ఇప్పుడు రీ ఎంట్రీ కోసం అమ్మడి వెయిటింగ్
తెలుగు తెరపై పొద్దుతిరుగుడు పువ్వులా విరిసిన అందమైన కథానాయికల జాబితాలో నభా నటేశ్ ఒకరుగా కనిపిస్తుంది. 2015లోనే ఓ కన్నడ సినిమాతో నటిగా ఆమె తన కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తరువాత ఓ మూడేళ్లకు టాలీవుడ్ కి పరిచయమైంది. 'నన్ను దోచుకుందువటే' తెలుగులో ఆమె మొదటి సినిమా.

ఆ తరువాత ఆమె తెలుగులో ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తూ వచ్చింది. ఆ సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలోనే ఆమె ప్రమాదానికి గురికావడం .. కొంతకాలం పాటు ఇంటిపట్టునే ఉండిపోవలసి రావడం వలన ప్రేక్షకులకు దూరమైంది.
