Puvvada Ajay Kumar: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వో బచ్చావి: పొంగులేటిపై పువ్వాడ ఫైర్

Puvvada fires on Ponguleti

  • ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి × పువ్వాడ
  • బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న పొంగులేటి
  • బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడంలేదని వ్యాఖ్యలు
  • పొంగులేటి డబ్బుతో బలిసిపోయాడన్న పువ్వాడ 

ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమని, బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపాలని ప్రజలు డిసైడ్ అయ్యారని, దాంతో బీఆర్ఎస్ నేతలకు నిద్ర కరవైందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడే ఏమైంది... ముందుంది మొసళ్ల పండుగ అని అన్నారు. కుట్రలు కుతంత్రాలు చేసి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఓటర్లు మాత్రం సీఎం కేసీఆర్ తో పాటు మిమ్మల్ని ఇంటికి పంపబోతున్నారని పొంగులేటి వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని అభివర్ణించారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కోట్లు వెనకేసుకుని బాగా బలిసిపోయావు అని విమర్శించారు. పొంగులేటి తీరు చూస్తుంటే ఓ పిట్టలదొర మాదిరే ఉందని ఎద్దేవా చేశారు. తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటున్నాడని అన్నారు. 

ఖమ్మం జిల్లాలో తమ కుటుంబానికి ఘన చరిత్ర ఉందని, 60 ఏళ్లుగా తాము నికార్సయిన రాజకీయాలు చేస్తున్నామని పువ్వాడ చెప్పుకొచ్చారు. తాను తండ్రికి తగ్గ వారసుడ్ని అని ఉద్ఘాటించారు. పొంగులేటి పక్కన ఉండేవాళ్లందరూ గూండాలు, గంజాయి అమ్మేవాళ్లు అని విమర్శించారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని వ్యాఖ్యానించారు.

Puvvada Ajay Kumar
Ponguleti Sreenivasa Reddy
BRS
Khammam District
Telangana
  • Loading...

More Telugu News