Tovino Thomas: ఆనాటి విలయానికి కారకులెవరు?: '2018' తెలుగు ట్రైలర్ రిలీజ్!

2018 movie trailer released

  • మలయాళంలో ఈ నెల 5న విడుదలైన '2018'
  • కేరళలో ఆ ఏడాది వచ్చిన వరదల నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రల్లో టోవినో థామస్ - అపర్ణ బాలమురళి
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల  

ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి రీమేకులుగా ఇక్కడికి వస్తున్న కథల సంఖ్య పెరుగుతూ వెళుతోంది. ఇక అనువాదాలుగా వస్తున్న సినిమాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన మలయాళంలో '2018' టైటిల్ తో ఒక సినిమా విడుదలైంది. 

టోవినో థామస్ - అపర్ణ బాలమురళి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో నిర్మితమైంది. ఆనాటి వరదలు ఒక్కసారిగా ముంచెత్తడానికీ .. ఎంతోమంది నిరాశ్రయులను చేయడానికి కారణం ఏమిటనే నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

మలయాళ ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకున్న ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ఊహించని వరదలు .. డ్యామ్ గేట్లు ఎత్తాలని నిర్ణయం తీసుకోవడం .. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం వలన జనంలో భయాందోళనలు వంటి విజువల్స్ తో ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

More Telugu News