Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

Heavy rains in hyderabad today

  • నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
  • జలదిగ్బంధనంలో రోడ్లు, ప్రజలకు ఇక్కట్లు
  • రాజేంద్రనగర్‌లో 4.6 శాతం వర్షంపాతం నమోదు
  • మరో రెండు మూడు గంటల్లో భారీ వర్షానికి అవకాశం ఉందన్న వాతావరణ శాఖ

సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్‌తో పాటూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. చాంద్రాయణగుట్ట, శాంలిబండలో ఈ తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్‌లో 4.6 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు కాగా, అంబర్‌పేట, శేరిలింగంపల్లి, శివరాంపల్లిలో 3.9 సెం.మీ చొప్పున వర్షంపాతం నమోదైంది. 

హఠాత్తుగా కురిసిన వర్షంతో పలుప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటూ నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. 

రానున్న కొన్ని గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News