Naresh: ఇక్కడ భయపడటానికేం లేదు: 'మళ్లీ పెళ్లి' ఈవెంటులో జయసుధ

Malli Pelli Pre Release Event

  • నరేశ్ సొంత బ్యానర్లో 'మళ్లీ పెళ్లి'
  • ఆయన సరసన నాయికగా పవిత్ర లోకేశ్ 
  • కీలకమైన పాత్రలో జయసుధ 
  • ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల 


సీనియర్ నరేశ్ హీరోగా 'మళ్లీ పెళ్లి' సినిమా రూపొందింది. విజయ్ కృష్ణ బ్యానర్లో నరేశ్ నిర్మించిన ఈ సినిమాకి, ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించాడు. నరేశ్ సరసన నాయికగా పవిత్ర లోకేశ్ నటించిన ఈ సినిమా, ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జయసుధ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది.

ఈ వేదికపై జయసుధ మాట్లాడుతూ .. 'పండంటి కాపురం' సినిమాతోనే నన్ను .. నరేశ్ ను విజయనిర్మల గారు పరిచయం చేశారు. ఆ తరువాత అటు నరేశ్ హీరో అయ్యాడు .. ఇటు నేను హీరోయిన్ అయ్యాను. ఇద్దరం కూడా మంచి ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్నాం. విజయనిర్మల గారికి మేము ఇచ్చిన గిఫ్ట్ అదే. గతంలో నరేశ్ తో  మా బ్యానర్లో మేము 'అదృష్టం' అనే సినిమాను కూడా తీయడం జరిగింది" అని అన్నారు. 

"విజయ్ కృష్ణ బ్యానర్ 50 ఏళ్లను పూర్తిచేసుకుంది .. అలాగే కెరియర్ పరంగా మేము కూడా 50 ఏళ్లను పూర్తిచేసుకోవడం .. ఇప్పుడు మళ్లీ ఇదే బ్యానర్లో కలిసి నటించడం విశేషం. ఇక ఎమ్మెస్ రాజుగారి నిర్మాణంలోనూ .. దర్శకత్వంలోను నేను నటించాను. ఆయన ఆలోచనా విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా తీసే ధైర్యం నరేశ్ కి ఉంది .. ఎవరి పోరాటం వారిది .. ఉన్నది ఒక్కటే జీవితం .. ఇక్కడ భయపడటానికేం లేదు" అంటూ చెప్పుకొచ్చారు.

Naresh
Pavitra Lokesh
Malli Pelli
MS Raju
  • Loading...

More Telugu News