Pawan Kalyan: రాజ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on music director Raj demise

  • గుండెపోటుతో సంగీత దర్శకుడు రాజ్ మృతి
  • రాజ్ కన్నుమూశారని తెలిసి చింతించానని పవన్ వెల్లడి
  • కోటితో కలిసి చక్కటి సంగీతం అందించారని కితాబు
  • అన్నయ్య చిరంజీవికి పలు హిట్స్ ఇచ్చారన్న పవన్

టాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ మృతిపై పవన్ కల్యాణ్ స్పందించారు. సినీ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారని తెలిసి చింతించానని వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 

అలనాటి సంగీత దర్శకులు టీవీ రాజు గారి వారసుడిగా రాజ్ తనదైన బాణీ చూపారని, తన మిత్రుడు కోటితో కలిసి రాజ్-కోటి ద్వయంగా చక్కటి సంగీతం అందించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. 

అన్నయ్య చిరంజీవి నటించిన యముడికి మొగుడు, ఖైదీ నెం.786, త్రినేత్రుడు వంటి చిత్రాలకు హిట్ గీతాలు అందించడంలో రాజ్ భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. రాజ్ మృతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ వెల్లడించారు.

Pawan Kalyan
Raj
Music Director
Demise
Tollywood
  • Loading...

More Telugu News