Bengaluru: బెంగళూరులో భారీ వర్షం... ఏపీ మహిళ మృతి... ఆర్థికసాయం ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య

AP woman dies in Bengaluru rain

  • బెంగళూరులో ఉరుములు మెరుపులతో భారీ వర్షం
  • కేఆర్ సర్కిల్ వద్ద పోటెత్తిన వరద
  • నీటిలో చిక్కుకుపోయిన కార్లు
  • ఏపీకి చెందిన భానురేఖ మృతి
  • సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్న భానురేఖ

బెంగళూరు నగరాన్ని ఈ సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల ధాటికి నగరంలో పలు చోట్ల చెట్లు కూలి వాహనాలు ధ్వంసం అయ్యాయి. కేఆర్ సర్కిల్ వద్ద వరద నీరు పోటెత్తింది. దాంతో అనేక వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. కార్లలో చిక్కుకున్న పలువురిని వెలుపలికి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సీఎం సిద్ధరామయ్య సందర్శించారు. 

కాగా, కేఆర్ సర్కిల్ వద్ద వరద కారణంగా కారులో చిక్కుకుని ఏపీకి చెందిన భానురేఖ అనే మహిళ మృతి చెందారు. భానురేఖ మృతికి సీఎం సిద్ధరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఆమె కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. భానురేఖ బెంగళూరులో ఓ కంపెనీలో ఐటీ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు.

Bengaluru
Rain
Woman
Death
Siddaramaiah
Karnataka
  • Loading...

More Telugu News