: నాగంకు కేసీఆర్ చురక


ప్రాంతీయ పార్టీలతో ప్రత్యేక తెలంగాణ రాదన్న నాగం జనార్థనరెడ్డికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చురకలంటించారు. జాతీయ పార్టీలతోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమన్న నాగం.. జార్ఖండ్ రాష్ట్రం ప్రాంతీయ పార్టీతోనే సాకారమైందన్న విషయం గుర్తెరగాలని హితవు పలికారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో నేడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడియం శ్రీహరి పార్లమెంటులో తెలంగాణ బాణీ వినిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News