Manchu Manoj: మంచు మనోజ్ న్యూ మూవీ నుంచి ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

What The Fish Movie Update

  • హీరోగా వరుస ఫ్లాపులు చూసిన మంచు మనోజ్ 
  • చాలా గ్యాప్ తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన 'వాట్ ద ఫిష్' 
  • కొంతసేపటి క్రితం వదిలిన ఫస్టు గ్లింప్స్
  • దర్శకుడిగా వరుణ్ కోరుకొండ పరిచయం

మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ఆ తరువాత హీరోగా 'దొంగ దొంగది' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళ్లాడుగానీ .. అదే స్థాయిలో సక్సెస్ లు మాత్రం వెంట రాలేదు. దాంతో సహజంగానే ఆయన హీరోగా వెనకబడుతూ వచ్చాడు. ఇక 'ఒక్కడు మిగిలాడు' తరువాత హీరోగా ఆయన కనిపించలేదు. 

అలా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మనోజ్, ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా 'వాట్ ద ఫిష్' సినిమా రూపొందుతోంది. ఈ రోజున మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. రెండు విభిన్నమైన స్వభావాలు కలిగిన ఒక వ్యక్తిగా ఈ గ్లింప్స్ లో మనోజ్ కనిపిస్తున్నాడు. 

విశాల్ బెజవాడ - సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ సినిమాకి వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫస్టు గ్లింప్స్ చూస్తుంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారనే విషయం అర్థమవుతోంది.

Manchu Manoj
Varun Korukonda
What The Fishy Movie

More Telugu News