Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌తో ఎల్‌ఎస్ ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రం!

Manchu Manoj New Movie Update

  • ఈ రోజు మంచు మనోజ్ బర్త్ డే 
  • కొత్త ప్రాజెక్టుల నుంచి వస్తున్న అప్ డేట్స్ 
  • భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా 
  • భారీ బడ్జెట్ తో కూడిన డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇకపై చేయబోయే సినిమాలు ఇంకో ఎత్తు. ఇప్పుడు ఆయన పూర్తిగా డిఫరెంట్ జానర్‌లను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ఈ రోజున ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ నుంచి ఆయనకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఎల్ ఎస్ ప్రొడక్షన్స్‌ మీద శ్రీమతి మమత సమర్పణలో ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమా రాబోతోంది. ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇతర వివరాలను మేకర్లు త్వరలోనే తెలియజేయనున్నారు.

Manchu Manoj
Actor
Tollywood
  • Loading...

More Telugu News