Adipurush: ‘మహిమాన్విత మంత్రం నీ నామం.. జై శ్రీ రామ్..’.. గూస్ బంప్స్ తెప్పించేలా ‘ఆదిపురుష్’ పాట.. మీరూ చూసేయండి

Jai Shri Ram Telugu song from Adipurush

  • ‘జైశ్రీరామ్’ తెలుగు పాటను రిలీజ్ చేసిన మేకర్స్
  • ప్రభాస్ డైలాగ్స్ తో మొదలైన పాట.. 
  • అద్భుతంగా స్వరపరిచిన బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్
  • జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ఆదిపురుష్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ‘జై శ్రీరామ్’ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ పాట అద్భుతంగా ఉంది.

పాట ప్రారంభంలో ‘‘ఎవరు ఎదురురాగలరు మీ దారికి, ఎవరికుంది ఆ అధికారం.. పర్వత పాదాలు వణికి కదుల్తాయి మీ హూంకారానికి’’ అంటూ రాముడి పాత్రధారి ప్రభాస్ చెప్పే డైలాగ్ తో పాట మొదలైంది. 2:39 నిమిషాల పాటలో ‘జైశ్రీరామ్’ అంటూ వచ్చిన ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

‘‘మహిమాన్విత మంత్రం నీ నామం.. జై శ్రీ రామ్.. జై శ్రీరామ్.. రాజారాం’’ అంటూ వచ్చే సంగీతం మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. సముద్రం మధ్యలో ప్రభాస్ నడిచి వచ్చే షాట్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరు లెవెల్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.

More Telugu News